Paddy Cultivation : ఖరీఫ్ వరిసాగులో రైతులు అనుసరించాల్సిన సూచనలు

ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిసాయి. అయితే ముందుగా వరి నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నాట్లను వేస్తున్నారు. కాలువలు, చెరువుల కింద వరిసాగుచేసే రైతులు ఇప్పుడిపపుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

Paddy Cultivation : ఖరీఫ్ వరిసాగులో రైతులు అనుసరించాల్సిన సూచనలు

Paddy Cultivation

Updated On : September 2, 2023 / 6:32 PM IST

Paddy Cultivation : ఖరీప్ వరిసాగు పనులు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే నారుమడులు పోసుకున్న రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతుండగా… ఆయకట్టు చివరి ప్రాంతాల రైతులు ఇప్పుడిప్పుడే నారుమడులు పోసుకుంటున్నారు. కొంత మంది రైతులు నేరుగా వెద పద్ధతిలో సాగు చేస్తున్నారు. అయితే రైతులు అనుసరించే సాగు విధానంలో ఎలాంటి మెళకువులు పాటించినట్లైతే అధిక దిగుబడిని పొందవచ్చో తెలియజేస్తున్నారు ఘంటసాల  కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, శ్రీలత.

READ ALSO : Banana Crop Farming : 5 ఎకరాల అరటి సాగుతో.. రూ. 25 లక్షల ఆదాయం

ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిసాయి. అయితే ముందుగా వరి నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నాట్లను వేస్తున్నారు. కాలువలు, చెరువుల కింద వరిసాగుచేసే రైతులు ఇప్పుడిపపుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నారుమడులు పోస్తున్నారు. నీటి సదుపాయం తక్కువగా వున్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలవైపు మొగ్గుచూతున్నారు.

వీటిలో డ్రమ్ సీడర్ తో నేరుగా దమ్ములో విత్తే  విధానం, పొడిదుక్కిలో వరి విత్తే సాగు విధానాలు రైతుల అవలంబిస్తున్నారు. నాట్లు ఏ పద్ధతిలో వేసినా, మనం చేపట్టే సాగు విధానాలపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. మరిన్ని వివరాలు రైతులకు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల  కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, శ్రీలత.

READ ALSO : Pindinalli : దానిమ్మ, మామిడి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు నష్టం కలిగిస్తున్న పిండినల్లి! నివారణ చర్యలు

రైతులు పంటలకు అధికంగా కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువులు అందించటం వల్ల మొక్కలకు ప్రధాన పోషకాలు మాత్రమే అందుతాయి. సూక్ష్మ పోషకాలు లభించవు. గతంలో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో పాటు వేప చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ పదార్థాల్ని ఎక్కువగా అందించేవారు. వీటి ద్వారా నేల సారంవంతంగా వుండి, మొక్కలకు సరిపడినంత సూక్ష్మ పోషకాలు లభించేవి.

అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. దీనివల్ల చాలా పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు బహిర్గతమై, దిగుబడులు తగ్గుతాయి. వాటిని గమనించి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి.