Groundnut Cultivation : వర్షాధారంగా ఖరీఫ్ వేరుశనగ సాగు – అధిక దిగుబడుల కోసం సమగ్ర సస్యరక్షణ  

Groundnut Cultivation : ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ ఖరీఫ్ లో అక్కడక్కడ కురిసిన వర్షాలకు వేరుశనగను  రైతులు విత్తుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్దమవుతున్నారు.

Groundnut Cultivation : వర్షాధారంగా ఖరీఫ్ వేరుశనగ సాగు – అధిక దిగుబడుల కోసం సమగ్ర సస్యరక్షణ  

Pest Management in Groundnut Cultivation

Groundnut Cultivation : నూనెగింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశనగ. ప్రస్థుతం ఖరీఫ్ పంటను రైతులు విత్తుతున్నారు. కొన్ని చోట్ల సరైన వర్షపాతం కోసం వేచిచూస్తున్నారు.  అయితే సాగులో మొదటి నుండే చీడపీడల నివారణ పట్ల జాగ్రత్త వహించాలి. లేదంటే తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు, విశాఖ జిల్లా, యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఎ.బి.ఎమ్ . శిరీష.

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశనగను వర్షాధారంగా విస్తారంగా సాగుచేస్తుంటారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ ఖరీఫ్ లో అక్కడక్కడ కురిసిన వర్షాలకు వేరుశనగను  రైతులు విత్తుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్దమవుతున్నారు.

అయితే, వేరుశనగ పంటకు చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఆకుముడత, పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే…దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వీటి నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా వుండాలని, వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు, విశాఖ జిల్లా, యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఎ.బి.ఎమ్ . శిరీష.

వేరుశనగను మొదటి నుంచి పలు విధాల తెగుళ్లు ఆశిస్తుండటం పరిపాటి. విత్తన శుద్ధి నుంచి పంట చివరి దశ వరకు ఆయా తెగుళ్ల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే నాణ్యత లేకపోవడమే కాక, దిగుబడులూ గణనీయంగా పడిపోయి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా  వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరైన సమయంలో వేయాలి. ఇటు సూక్ష్మపోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది.

Read Also : Paddy Nursery : తెలుగు రాష్ట్రాల్లో వరినామడులు పోస్తున్న రైతులు..