Turmeric Cultivation : సేంద్రీయ పసుపు సాగులో ఎరువులు, నీటి యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రెండు వరుసల వసువు, ఒక వరుస మొక్కజొన్న వేయడం వలన పసుపు దిగుబడులను గణనీయంగా పెంచవచ్చు. అదే విధంగా మొక్కజొన్న వలన అదనపు లాభాన్ని అర్జించవచ్చు. ఒక్కసారి పసుపు వేసిన వంట చుట్టూ రక్షక పంటగా 2 వరుసల కంది పంట వేసుకోవాలి.

Turmeric Cultivation : సేంద్రీయ పసుపు సాగులో ఎరువులు, నీటి యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Turmeric Cultivation

Turmeric Cultivation : పసుపు దుంపజాతి పంట. ఎక్కువగా ఉష్ణమండలంలో తేమతో కూడిన వాతావరనంలో పండించటానికి అనుకూలం. పసుపు దుంపల్లోని కర్కుమిన్ పుసుపుదనాన్ని కలిగించే పదార్ధం. సుగంధ తైలం 2 నుండి 6శాతం ఉండటం వల్ల ఆహార పదార్దాలకు రంగు, రుచి, సువాసనలను కలిగిస్తుంది. ఔషదాలలో సౌందర్య సాధనాలలో పరిమళ ద్రవ్యాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు.

బలమైన నేలలు పసుపు పండించడానికి శ్రేష్టమైనవి. గరప నేలలు, మురుగునీటి పారులద సౌకర్యం గల ఇతర నేలలు అనుకూలం. చౌడు నేలలు, నల్లరేగడి భూములు, నీరు నిలువ ఉండే నేలలు పనికిరావు. ఉదజని సూచిక 5 నుండి 7.5 ఉన్నచో ఈ పంటకు అనుకూలం. సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉండాలి.

READ ALSO : Groundnut Crop : వేరుశనగలో పంటను ఆశించే పొగాకు లద్దె పురుగు.. నివారణ చర్యలు

రాజేంద్ర సోనియా వ్రతిభ, అల్లేసి, రశ్మి ప్రభ, సుదర్శన, సుగంధం వంటి పసుపు రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. స్వల్పకాలిక రకాలను అక్టోబరు చివరి వారంలో మధ్యకాలిక రకాలను నవంబర్‌ మొదటి పక్షంలో, దీర్హకాలిక రకాలను నవంబర్‌ రెండో పక్షంలో విత్తుకోవాలి. ఎకరాకు సుమారుగా 1000 కిలోల విత్తనం కావాలి. తల్లి కొమ్ములు, పిల్ల కొమ్ములు నాటడానికి వినియోగించుకోవచ్చు. 6నుండి 8 సెం.మీ. పొడవు గల ధృఢంగా ఉండే మొలకెత్తు మొగ్గలున్నపిల్ల కొమ్ములు అనువుగా ఉంటాయి.

వేసవిలో లోతు దుక్కులు చేసి గుల్లబారేటట్లు దున్నాలి. 6,8 సార్లు దున్నిన అఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 10 టన్నుల చెరువు మట్టి వేసి కలియదున్నాలి. విత్తే సమయంలో 2500 కిలోల నాడెవ్‌ కంపోస్ట్ వేయాలి. 125 కిలోల ఘనజీవామృతాన్ని వేసి దున్నాలి.

ఎంపిక చేసిన 1000కిలోల విత్తనాన్ని బీజామృతం , బీజరక్ష, పంచగవ్యలో ముంచి అరగంట నానబెట్టిన తరువాత విత్తనాన్ని జాగ్రత్తగా తీసి నీడలో ఆరబెట్టి విత్తుకోవడం మంచిది. విత్తనశుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా సంక్రమించే దుంప, వేరుకుళ్ళు, తాటాకు తెగులు, ఆకుమచ్చ తెగుళ్ళకు కారణమైన శిలీంద్రాలు నాశనమవుతాయి. భూమిలోని హానికర శిలీంద్రాలు కొంతకాలం వరకు విత్తనాన్ని ఆశించవు.

READ ALSO : Turmeric Crop Cultivation : పసుపు విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు.. రకాల ఎంపిక, సాగు మెళకువలు

తక్కువ వర్షపాత ప్రాంతాల్లో పసుపును నీటి వసతి కింద సాగు చేయాలి. 4 నుండి 6 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. పసుపులో బిందుసేద్యం ద్వారా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. దుంపకుళ్ళు ఆశించినప్పుడు నీటి తడుల మధ్య వ్యవధి పెంచాలి. కాలువల మధ్య భూమిని పచ్చి ఆకులు లేదా ఎండు ఆకులతో కప్పి ఉంచాలి. దీనివల్ల పసుపు బాగా మొలకెత్తడమే గాక కలుపు పెరగదు.

అంతర పంటలు ;

రెండు వరుసల వసువు, ఒక వరుస మొక్కజొన్న వేయడం వలన పసుపు దిగుబడులను గణనీయంగా పెంచవచ్చు. అదే విధంగా మొక్కజొన్న వలన అదనపు లాభాన్ని అర్జించవచ్చు. ఒక్కసారి పసుపు వేసిన వంట చుట్టూ రక్షక పంటగా 2 వరుసల కంది పంట వేసుకోవాలి. దీనివలన అదనపు అదాయం సమకూరడమే గాక గాలిని అడ్డుకుంటుంది.

READ ALSO : Cultivation Of Turmeric : హైడ్రోఫోనిక్ విధానంలో.. బస్తాల్లో పసుపు సాగు

ఎరువులు యజమాన్యం ;

విత్తనం విత్తే ముందు 2500 కిలోల నాడెప్‌ కంపోస్ట్‌ వేయాలి. 125 కిలోల ఘనజీవామృతాన్ని విత్తేటప్పుడు వేసి 60 రోజుల తర్వాత 125 కిలోల ఘనజీవామృతాన్ని మొక్క మొదళ్ళలో వేయాలి. అలాగే విత్తిన 45 రోజులకు 200 లీటర్ల ద్రవ జీవామృతాన్ని మొక్కల మొదళ్ళలో వేయాలి. అలాగే విత్తిన 45 మరియు 75 రోజులకు 200 లీటర్ల ద్రవజీవామృతాన్ని మొక్కల మొదల్భలో పోయాలి. 100, 125 రోజులకు ద్రవజీవామృతాన్ని 200 లీటర్లు ఒక ఎకరాకు మొక్కల మొదళ్ళ వద్ద పోయాలి లేదా నీటి తడులు ఇచ్చినపుడు దానితో కలిపి పారించాలి. ప్రతి 20 రోజులకొకసారి పంచగవ్య పిచికారి చేయాలి. దీనివలన మొక్క ఏపుగా పెరగడమే కాకుండా, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొంటుంది.

250 నుండి 300 కిలోల వేప పిండిని ఎకరాకు వేసినచో దుంప కుళ్ళును నివారించవచ్చు. నీటి తడి ఇచ్చిన తరువాతనే వేప పిండిని చల్లాలి. ఎరువుతోపాటు 2 కిలోల టైరోడెర్మా విరిడి అనే శిలీంద్రనాశక పొడిని సేంద్రియ ఎరువులో కలుపుకొని నేలలో వేసినచో దుంప కుళ్ళును మరియు ఆకుమచ్చ తెగులు నివారించవచ్చు. ఎకరానికి ౩ కిలోల సూడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌ అనే బ్యాక్టీరియా పొడిని కూడా కలిపినట్లయితే భూవి నుండి సోకే వేరుకుళ్ళు, దుంవకుళ్ళు నివారించవచ్చు.

READ ALSO : Turmeric Production : పసుపు తీతలో జాగ్రత్తలు.. నాణ్యమైన పసుపు ఉత్పత్తికి మెళకువలు

పంట కోత ;

పసుపు పంట 210 నుండి 270 రోజులకు త్రవ్వకానికి వస్తుంది. పసువు పంట పక్నానికి చేరుకున్న కొద్దీ మొక్కల ఆకులు ఎండడం ఆరంభమవుతాయి. మొక్కలు ఎండిపోయే వరకు పంట కోయరాదు. పసువును త్రవ్వే రెండు రోజుల ముందు మొక్క అకులు, కాండాలను భూ మట్టానికి కోయాలి. తరువాత నీరు పెట్టిన 2 రోజుల తర్వాత దుంపలు త్రవ్వకం ప్రారంభించాలి. త్రవ్వి తీసిన వారం లోపల ఉడకటెడితే పసుపు నాణ్యత బాగా ఉంటుంది.