Pests in Turmeric : పసుపులో చీడపీడల ఉధృతి..నివారణ
మొదట పసుపు మొక్కలో ముదురు ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోయి, రాలిపోతాయి. ఈ తెగులు ఎక్కువైనట్లయితే కింది భాగంలో ఉన్న ముదురు అకుల నుండి పైనున్న లేత ఆకులకు వ్యాప్తి చెందుతాయి. కాండం మెత్తగా తయారై కాండం పైన నీటిలో తడిసిన మాదిరిగా మచ్చలు ఏర్పడి తరువాత గోధుమ రంగుకు మారుతుంది.

Turmeric Farming
Pests in Turmeric : పసుపండించే దేశాలలో భారత దేశం అగ్రస్ధానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రైతులు పసుపు పంటను సాగు చేస్తున్నారు. పసుపులో చీడపీడలు రైతులకు ఇబ్బందికరంగా మారాయి. సకాలంలో చీడపీడలు, తెగళ్ళ విషయంలో చర్యలు తీసుకుంటే పంటను కాపాడుకోవటం తోపాటు, మంచి దిగుబడులు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పసుపులో ప్రధానంగా వ్యాపించే తెగుళ్ళు నివారణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
READ ALSO : Onion Cultivation : ఉల్లి గడ్డ సాగుకు అనువైన రకాలు..
పసుపులో తెగుళ్ళు ;
తాటాకు మచ్చ తెగులు, లక్షణాలు ;
ఆకులపై అండాకారపు పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఏర్పడుతుంది. ఈ తెగులు లక్షణాలు ఎక్కువైనప్పుడు పండుబారి, ఎండిపోయి రాలిపోతాయి. దీని నివారణకు విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. తెగులు వచ్చిన ఆకులను తుంచి కాల్చివేయాలి. ఒకలీటరు నీటిలో 1 మి.లీ. ప్రొపికొనజోల్ 1 గ్రా. కార్బండిజమ్ మందులకు 0.5 మి.లీ. సబ్బు నీటిని కలిపి ఆకులను తడిచే విధంగా పిచికారి చేయాలి.
ఈ తెగులును తట్టుకునే రకాలైన ఆర్మూర్, దుగ్గిరాల ఎరుపు కె.టి.యస్-38, సి.యల్.ఐ-317, ప్రతిభ, ప్రభ, దుగ్గిరాల తెలుపు, సెలమ్ రకాలను ఎన్నుకొని విత్తుకోవాలి.
READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు
ఆకు మచ్చతెగులు:
అకులపై చిన్న చిన్న మచ్చలు అనుకూల పరిస్థితులో పసుపు రంగు చుక్కలు ఆకులపై ఏర్పడి తరువాత గోధుమ రంగులోకి మారి ఆకులు వడలిపోయి, రాలిపోతాయి. నివారణకు పైన తాటాకు మచ్చ తెగులుకు చెప్పిన మందులను పిచికారి చేయాలి. ఈ తెగులును తట్టుకునే రకాలైన సి.యల్.ఐ-317, ప్రతిభ , ప్రభ, సెలమ్‌కాలను ఎన్నుకొని విత్తుకోవాలి.
దుంపకుళ్ళు లక్షణాలు;
మొదట పసుపు మొక్కలో ముదురు ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోయి, రాలిపోతాయి. ఈ తెగులు ఎక్కువైనట్లయితే కింది భాగంలో ఉన్న ముదురు అకుల నుండి పైనున్న లేత ఆకులకు వ్యాప్తి చెందుతాయి. కాండం మెత్తగా తయారై కాండం పైన నీటిలో తడిసిన మాదిరిగా మచ్చలు ఏర్పడి తరువాత గోధుమ రంగుకు మారుతుంది. తల్లి కొమ్మలు, పిల్ల దుంపలు కుళ్ళి మెత్తబడిపోతాయి. ఈ తెగులు వచ్చిన దుంపలను పరిశీలిస్తే లోపల పసుపు రంగుకు బదులు మట్టి రంగు కనిపిస్తుంది. దుంపలు కుళ్ళిపోయి చెడువానన రావటమేకాకుండా నాణ్యతలో తేడా వచ్చి మార్కెట్‌లో రేటు తగ్గిపోతుంది.
READ ALSO : Sesame Cultivation : వేసవి నువ్వు సాగులో చీడపీడల నివారణ
దీని నివారణకు విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. 3 గ్రా. రేడోమిల్ యం. జెడ్ లేదా మాంకోజెల్ శిలీంద్ర నాశినులతో పాటు 2 మి.లీ. మోనోక్రోటోఫాస్ మందును ఒక లీటరు. నీటిలో కలిపిన ద్రావణంలో కొమ్ములను 30-40 నిమిషాల వరకు నానబెట్టిన తరువాత నీరు మార్చి లీటరు నీటికి 5 గ్రా. ట్రైకోరెర్మావిరడిని కలిపి ఆ ద్రావణంలో అరగంట సేపు నానబెట్టి ఉంచిన తరువాత ఈ కొమ్ములను నీడలో ఆరబెట్టి నాటుకోవాలి. ఈ తెగులు తట్టుకొనే రకాలైన సుగుణ, సుదర్శన్, సెలమ్, కెటి.యస్-3, కెటియస్‌లను ఎన్నుకొని విత్తుకోవాలి.
ఈ తెగులు వచ్చిన వెంటనే మొక్కలను గుర్తించి మొదళ్ల వద్ద 3గ్రా రిడోమిల్ యం.జడ్ లేదా 3గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందులను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి , మొక్కజొన్న, వేరుశనగ మొదలకు పంటతో పంట మార్పిడి చేయాలి.