Vegetable Cultivation : వేసవి కూరగాయ సాగులో పాటించాల్సిన మెళకువలు

Vegetable Cultivation : వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.40 నుండి 60 పలుకుతున్నది. ఏ కూరగాయ పండించినా ఫుల్‌ డిమాండ్‌ఉంటుంది.

Vegetable Cultivation : వేసవి కూరగాయ సాగులో పాటించాల్సిన మెళకువలు

Techniques in Summer Vegetable Cultivation

Updated On : April 18, 2024 / 3:22 PM IST

Vegetable Cultivation : వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో వుండే తక్కువ తేమ , కూరగాయలసాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, రైతులు.. వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్దతులను చేపట్టాలని సూచిస్తున్నారు, కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.

Read Also : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం

వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.40 నుండి 60 పలుకుతున్నది. ఏ కూరగాయ పండించినా ఫుల్‌ డిమాండ్‌ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే.. యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే  3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది. కానీ వేసవిలో అదే కూరగాయలు సాగుచేస్తే, అధిక లాభాలు వస్తాయి. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం , వడ గాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్‌సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.

కాబట్టి, నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం, కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించటం వల్లే, ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు