Cotton Crop : తెలంగాణలో అధిక విస్తీర్ణంలో పత్తిసాగు.. తొలిదశలోనే కలుపు నివారించాలంటున్న శాస్త్రవేత్తలు

పత్తి ఎదిగే దశలోనే కలుపు అవరోదంగా మారుతోంది.  అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.

Cotton Crop : తెలంగాణలో అధిక విస్తీర్ణంలో పత్తిసాగు.. తొలిదశలోనే కలుపు నివారించాలంటున్న శాస్త్రవేత్తలు

Cotton Crop

Updated On : July 27, 2023 / 7:09 AM IST

Cotton Crop : తెలుగు రాష్ట్రాల్లో  విత్తే ప్రధాన వాణిజ్యపంటలలో పత్తి అగ్రస్థానంలో వుంది. వర్షాధారంగా సాగుచేసే పంటలలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్థుతం చాలాచోట్ల పత్తిని విత్తారు. మరి కొంత మంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు.

READ ALSO : Cotton Cultivation : ఎత్తు మడులలో.. పత్తిసాగు ఎంతో మేలు

అయితే  పత్తి ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారుతూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలోనే కలుపు నివారణ చర్యలు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుదని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు.

తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 50 లక్షలు.  వర్షాధారంగా పండే పంటల్లో… అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు. దీంతో తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40 శాతం విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది. గత 3 సంవత్సరాలుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది.

READ ALSO : Cotton Varieties : రైతులకు అందుబాటులో దేశీ పత్తి రకాలు

ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తుండటం, మద్దతు ధర ఆశాజనకంగా వుండటం వల్ల రైతులకు అన్నివిధాలుగా పత్తి సాగు అనుకూలంగా వుండటంతో ఈ ఏడాది ఏకంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది . అయితే ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో కొంత మంది రైతులు పత్తిని విత్తారు. మరి కొంత మంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు.

READ ALSO : Cotton Cultivation : పత్తిసాగుకు సన్నద్దమవుతున్న రైతులు.. సాగులో మేలైన యాజమాన్యం

పత్తి ఎదిగే దశలోనే కలుపు అవరోదంగా మారుతోంది.  అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్దితులలో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్ములన సరిగ్గా జరగక పోగా, కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తొలిదశలో పత్తిలో ఆశించే కలుపునివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్.