కరోనా ఎఫెక్ట్: ఏపీలో పదోతరగతి పరీక్షలు మళ్లీ వాయిదా

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఏపీలో మరోసారి పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల (మార్చి 31, 2020) నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
పరీక్షలు నిర్వహిస్తే సెంటర్ల దగ్గర విద్యార్థులు గుంపులుగా చేరే అవకాశం ఉంది. దానివల్ల విద్యార్ధులకు వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు జరగాల్సి ఉంది. కానీ.. ఈ పరీక్షలు తిరిగి ఎప్పటినుంచి నిర్వహిస్తారని చెప్పలేదు.
రెండువారాల తర్వాత పరీక్షల మీద అవగాహన వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా పరీక్షల వాయిదా మీద ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. పరీక్షలు వాయిదా పడటం వల్ల మా పిల్లల ఆరోగ్యానికి హానికలగదని అన్నారు.
See Also | కరోనా ఎఫెక్ట్ : 3 వేల మంది ఖైదీల విడుదల!..ఏ రాష్ట్రంలో