Andhrapradesh : 24 గంటల్లో 2,224 కరోనా కేసులు, 31మంది మృతి
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 2 వేల 224 మందికి కరోనా సోకింది. 31 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

2224 Corona Cases 24 Deaths In 24 Hours Andhrapradesh
Andhrapradesh COVID : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 2 వేల 224 మందికి కరోనా సోకింది. 31 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 42 వేల 252 యాక్టివ్ కేసులుండగా…12 వేల 630 మంది చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 18,79,201 పాజిటివ్ కేసులకు గాను 18,24,319 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-
చిత్తూరులో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, అనంతపూర్ లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విశాఖపట్టణంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చనిపోయారు.
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 66. చిత్తూరు 409. ఈస్ట్ గోదావరి 299. గుంటూరు 191. వైఎస్ఆర్ కడప 173. కృష్ణా 222. కర్నూలు 66. నెల్లూరు 116. ప్రకాశం 157. శ్రీకాకుళం 51. విశాఖపట్టణం 122. విజయనగరం 93. వెస్ట్ గోదావరి 259. మొత్తం : 2,224