Kandukur Incident: కందుకూరు ఘటనలో మృతుల కుటుంబాలకు టీడీపీ రూ.23.5లక్షల పరిహారం..
కందుకూరు ఘటనపై చంద్రబాబు నాయుడు టీడీపీ సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ తరపున రూ. 15లక్షలు బాధిత కుటుంబాలకు అందజేయాలని నిర్ణయించారు. అంతేకాక టీడీపీ నేతలు రూ. 8.5లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం టీడీపీ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 23.5 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.

Kandukur Incident
Kandukur Incident: నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోలో తొక్కిసలాట చోటుచేసుకొని ఎనిమిది మరణించిన విషయం విధితమే. పలువురికి తీవ్ర గాయాలుకాగా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే రూ.8లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు.
Kandukur Incident: కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
తాజాగా ఈఘటనపై చంద్రబాబు నాయుడు టీడీపీ సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ తరపున రూ. 15లక్షలు బాధిత కుటుంబాలకు అందజేయాలని నిర్ణయించారు. అంతేకాక టీడీపీ నేతలు మృతుల కుటుంబాలకు రూ. 8.5లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం టీడీపీ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 23.5 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే కందుకూరు ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 2లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50వేలు పరిహారం ప్రకటించారు.
Kandukur Accident: చంద్రబాబు సభలో తోపులాట.. ఏడుగురి మృతి.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు
కందుకూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదిలా మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం తమతమ స్వస్థలాలకు తరలించారు. కాగా చంద్రబాబు, టీడీపీ నేతలు మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.