40 లక్షల మందిపై ప్రభావం.. 364 స్కూళ్లను సహాయ కేంద్రాలుగా మార్చాం.. మీరు ఇలాంటి టైమ్‌లో అలా చేస్తామంటే సరికాదు: లోకేశ్
"బీచ్‌ల దగ్గరికి వెళ్తాం.. వీడియోలు తీసుకుంటాం.. అంటే కుదరదు.. ఇది సరైన టైమ్ కాదు.. అందరూ జాగ్రత్తగా ఉండాలి" అని లోకేశ్ అన్నారు.
Nara lokesh: మొంథా తుపాను ప్రభావం 40 లక్షల మందిపై పడుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. 364 స్కూళ్లను సహాయ కేంద్రాలుగా మార్చామని వివరించారు.
ఇవాళ నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా కరెంట్ స్టేటస్ ఏంటనేది తెలుసుకుంటున్నారు. సైక్లోన్ సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాల మేరకు పునరావాస చర్యలు చేపట్టాలి. ప్రజలను నేను ఒకటి కోరాలనుకుంటున్నాను. (Nara lokesh)
దయచేసి అందరూ మీ ఇళ్లలోనే ఉండండి. బీచుల వంటి ప్రాంతాల్లోకి వెళ్లొద్దు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడతాం. ఇప్పటికే మీడియా మిత్రులు కూడా ఈ విషయాల కవరేజ్ చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా న్యూస్ ఆర్టికల్స్ వేస్తున్నారు. నేను మానిటర్ చేస్తున్నాం పాజిటివ్ గా బిల్డ్ చేస్తున్నారు. ప్రజలు కూడా టైం టు టైం అడ్వైజరీ తీసుకొని అది పాటించాలని మేము కోరుతున్నాం.
ఈ టైమ్‌లో బయటికి వెళ్తామంటే అది కరెక్ట్ కాదు. బీచ్‌ల దగ్గరికి వెళ్తాం.. వీడియోలు చేస్తాం.. అంటే కుదరదు.. ఇది సరైన టైం కాదు.. అందరూ జాగ్రత్తగా ఉండాలి. చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది. చాలా ప్రాంతాల్లో వర్షాలు గట్టిగా పడుతున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా ఫీల్డ్ లో ఉన్నారు. యుద్ధ ప్రాతిపాదికన కరెంట్ రిస్టోర్ చేస్తాం. దీనికే ప్రాధాన్యం ఇస్తున్నాం. గతంలో తుపానులు వచ్చిన సమయంలోనూ చేసి చూపించాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకి చాలా అనుభవం ఉంది.
