Road Accident : అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండలం జ్వాలాపురం స్టేజ్ దగ్గర శనివారం రాత్రి ఓ కారును లారీ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు

Road Accident : అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి

Road Accident

Updated On : October 30, 2021 / 10:21 PM IST

Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండలం జ్వాలాపురం స్టేజ్ దగ్గర శనివారం రాత్రి ఓ కారు లారీని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు.

Disease Attack : యువతపై జబ్బుల దాడి… చిన్న వయస్సులోనే మరణం అంచులకు..

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ కుటుంబం కారులో వివాహ కార్యక్రమానికి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ముందు టైరు పేలడంతో అదుపుతప్పి అనంతపురం నుంచి చెన్నై వెళ్తున్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అమ్మాజి(50), కుమారుడు రెడ్డి భాషా(25), కుమార్తె రేష్మ(30), అల్లుడు బాబు(36) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. బాబు, రేష్మల కుమార్తె జస్మిత(5)కు తీవ్ర గాయాలయ్యాయి. బాలికను చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు కారులో చిక్కుకు పోవడంతో పోలీసులు స్థానికుల సాయంతో బయటకు తీశారు.

బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.