GST : ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్లపై జీఎస్టీ.. నిన్నటి నుంచే అమలు

ఆర్టీసీ టికెట్‌ బుకింగ్‌ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టళ్లలో బస్‌ టికెట్లు కొనుగోలు చేసేవారు జీఎస్టీ చెల్లించాలని అధికారులు అన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

GST : ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్లపై జీఎస్టీ.. నిన్నటి నుంచే అమలు

Gst

Updated On : January 2, 2022 / 1:41 PM IST

GST on APSRTC non-AC tickets : ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్లపై జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ ఈ కామర్స్‌ పోర్టల్స్, యాప్స్‌ ద్వారా బుక్‌ చేసుకునే ఆర్టీసీ నాన్‌ ఏసీ టికెట్లపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు అధికారులు జీఎస్టీ విధింస్తున్నారు.

ఆర్టీసీ టికెట్‌ బుకింగ్‌ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టళ్లలో బస్‌ టికెట్లు కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా జీఎస్టీ చెల్లించాలి. జనవరి1, 2022వ తేదీ నుంచే ఆర్టీసీ టిక్కెట్లపై జీఎస్టీ వడ్డన ప్రారంభమైంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

Gold Price Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర

సేవా దృక్పథంతో నిర్వహించే ఆర్టీసీ పోర్టల్ ద్వారా లేదా ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు, నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు మాత్రం ఎలాంటి జీఎస్టీ విధించరని అధికారులు వెల్లడించారు. కాబట్టి ప్రైవేట్ ఈ కామర్స్ పోర్టల్స్, యాప్ప్ ద్వారా కాకుండా ఆర్టీసీ అధికారిక పోర్టల్, ఏజెంట్ల నుంచే బస్ టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.