ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు…24 గంటల్లో 7,998 పాజిటివ్ కేసులు

  • Published By: bheemraj ,Published On : July 23, 2020 / 08:50 PM IST
ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు…24 గంటల్లో 7,998 పాజిటివ్ కేసులు

Updated On : July 23, 2020 / 9:49 PM IST

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 7,998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 61 మంది మృతి చెందారు. 24 గంటల్లో 58,052 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,391 మందికి కరోనా సోకింది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 10,000 దాటింది. ఏపీలో 34,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 37,555 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో ఎనిమిది వేలకు చేరువలో కరోనా కేసుల సంఖ్య చేరింది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన 20 రోజులతో పోల్చితే ఎక్కడ ఒక్క రోజు కూడా తగ్గకుండా పెరుగుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 1184, అనంతపురంలో 1016 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 72,711 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61 మంది చనిపోతే ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 14 మంది చనిపోయారు. గుంటూరు 7, కర్నూలు 7, కృష్ణా 6, శ్రీకాకుళం 6, విశాఖ 5, విజయనగరం 5 చొప్పున చనిపోయారు.

కరోనా పూర్తిస్థాయిలో గ్రామీణస్థాయికి విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో చైతన్యం ఇంకా రాలేదు. మాస్క్ లు పెట్టుకునే పరిస్ధితి లేదు. భౌతికదూరం పాటించడం లేదు. ప్రధానంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల దగ్గర ప్రజలు విస్తృతంగా చేరుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూ కట్టి ఉంటున్నారు. కనీస ప్రమాణాలు పాటించడం లేదు.