మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. 30 అంశాలపై కేబినెట్ చర్చించగా.. చిరు వ్యాపారులకిచ్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
అలాగే ఉచిత నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీపై కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక, ఇసుక పాలసీలో మార్పులపై కేబినేట్ చర్చించింది. కొత్త ఇసుక విధానంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రజాభిప్రాయం సేకరించగా ఈ కేబినేట్లో దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.
మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ కేబినేట్ ఆమోదం తెలపగా.. రూ.5,835 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయ్యేలా నిర్ణయం తీసుకుంది. చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి ఆమోదం తెలపగా.. రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్టు, కొత్త ఇసుక పాలసీలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక విజయనగరం జిల్లా గాజులరేగలో.. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
ఇదే సమయంలో ప్రతి ఇంటికి ఉచిత నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేసే అంశంలో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వగా.. దానిపై కీలక నిర్ణయం తీసుకుంది.