Elephant Attack : చిత్తూరు జిల్లాలో మరొకరి ప్రాణం తీసిన ఒంటరి ఏనుగు

జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం కొనసాగుతోంది. అటవీ అధికారులు ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ కొనసాగిస్తున్నారు.

Elephant Attack : చిత్తూరు జిల్లాలో మరొకరి ప్రాణం తీసిన ఒంటరి ఏనుగు

elephant attack woman died

Updated On : August 31, 2023 / 12:58 PM IST

Elephant Attack – Woman Died : చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఇద్దరిని తొక్కి చంపిన ఒంటరి ఏనుగు ఇవాళ మరొకరి ప్రాణం తీసింది. ఏనుగు దాడిలో మహిళ మృతి చెందారు. చిత్తూరు – తమిళనాడు సరిహద్దు ప్రాంతం కోడేనత్తం గ్రామానికి చెందిన మహిళపై ఏనుగు దాడి చేసింది. దీంతో ఘటనా స్థలంలోనే మహిళ మృతి చెందారు.

నిన్న (బుధవారం) దంపతులను మట్టుబెట్టిన మదపుటేనుగు ఇవాళ (గురువారం) మహిళను చంపినట్లు గుర్తించారు. ఇవాళ మళ్లీ ఒంటరి ఏనుగు గుడిపాల మండలం రామాపురం గ్రామానికి వచ్చింది. నిన్న ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఒంటరి ఏనుగు రాత్రి అడవిలోకి వెళ్లడంతో అటవీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Elephant Killed Couple : చిత్తూరు జిల్లాలో దంపతులను తొక్కి చంపిన ఏనుగు

అయితే ఇవాళ ఒంటరి ఏనుగు మరో మహిళను చంపి తిరిగి గ్రామం పైకొచ్చింది. జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం కొనసాగుతోంది. అటవీ అధికారులు ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ కొనసాగిస్తున్నారు. ఏనుగును మచ్చిక చేసుకుని బంధించేందుకు రెండు శిక్షణా ఏనుగులు వినాయక్, జయంత్ రంగంలోకి దిగాయి.