House Motion Petition : చంద్రబాబును త్వరగా కోర్టులో హాజరుపర్చాలని హౌస్ మోషన్ పిటిషన్.. తిరస్కరించిన ఏసీబీ కోర్టు జడ్జి

సీఐడీ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన తర్వాత కోర్టులో పిటిషన్ వేయాలని జడ్జి స్పష్టం చేశారు. మరోవైపు జడ్జి నివాసానికి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, టీడీపీ శ్రేణులు చేరుకోవడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

House Motion Petition : చంద్రబాబును త్వరగా కోర్టులో హాజరుపర్చాలని హౌస్ మోషన్ పిటిషన్.. తిరస్కరించిన ఏసీబీ కోర్టు జడ్జి

Chandrababu (3)

Updated On : September 10, 2023 / 1:43 AM IST

House Motion Petition Rejected : టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు వయసు, ఆరోగ్య రీత్యా వెంటనే కోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలు ఇవ్వాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబును త్వరగా కోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలివ్వాలని టీడీపీ లీగల్ సెల్ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు జడ్జి తిరస్కరించారు.

సీఐడీ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన తర్వాత కోర్టులో పిటిషన్ వేయాలని జడ్జి స్పష్టం చేశారు. మరోవైపు జడ్జి నివాసానికి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, టీడీపీ శ్రేణులు చేరుకోవడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించారు. న్యాయవాదులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

మరోవైపు చంద్రబాబుకు బెయిల్ కోసం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. డిలే ఆఫ్ ప్రొడ్యూస్ లో భాగంగా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ హౌస్ మోహషన్ పిటిషన్ వేసేందుకు చంద్రబాబు తరపు లాయర్లు సిద్ధమయ్యారు. చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టేందుకు రేపు ఉదయం 6 గంటల వరకు అవకాశం ఉంది.  కాగా, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించారు.

Chandrababu : సిట్ కార్యాలయంలో చంద్రబాబుతో మాట్లాడిన లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ

చంద్రబాబుకు సీఐడీ అధికారులు 20 ప్రశ్నలు సంధించారు. సీఐడీ అధికారులు చంద్రబాబు సమాధానాలను రికార్డు చేశారు. వైద్య పరీక్షల తర్వాత చంద్రబాబును సీఐడీ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనుంది. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్ర చంద్రబాబు తరపున వాదించనున్నారు. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్, వివేకానంద వాదనలు వినిపించనున్నారు.