Actor Nara Rohit : నారావారిపల్లెలో నారా రోహిత్ నిరసన

నారావారిపల్లెలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు.

Actor Nara Rohit : నారావారిపల్లెలో నారా రోహిత్ నిరసన

Nara Rohit Protest

Updated On : November 21, 2021 / 11:26 AM IST

Actor Nara Rohit :  నారావారిపల్లెలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసిపి ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు.

తమ పెదనాన్న చంద్రబాబునాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఆదర్శంగా నిలిచారు. అన్న ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు, ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు.

Also Read : Visakha TDP Office : విశాఖ టీడీపీ ఆఫీసులో పోలీసుల సోదాలు

ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో కలుగ చేసుకోలేదు…గడప దాటలేదు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెది.  అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసిపి నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదు.

జీవితంలో ఎన్నడూ లేనివిధంగా వైసిపి నేతలు మనసు గాయపర్చినప్పటికీ భువనేశ్వరమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తుపాను బాధితులకు సహాయ,సహకారాలు అందిస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం మరోమారు ఇటువంటి దారుణానికి ఒడిగడితే సహించేది లేదని నారా రోహిత్ హెచ్చరించారు.