Bojjala Sudhir Reddy : ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, మన ప్రభుత్వం వచ్చాక 6నెలలు మమ్మల్ని వదిలేయండి

Bojjala Sudhir Reddy : రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిందే. పార్టీ అధికారంలోకి వచ్చాక.. అందరి సంగతి తేలుస్తాం.

Bojjala Sudhir Reddy : ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, మన ప్రభుత్వం వచ్చాక 6నెలలు మమ్మల్ని వదిలేయండి

Bojjala Sudhir Reddy

Updated On : June 29, 2023 / 6:18 PM IST

Bojjala Sudhir Reddy – SCV Naidu : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీ నేత ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరారు. తన అనుచరులతో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఎస్సీవీ నాయుడు.. టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎస్సీవీ నాయుడు చేరిక కార్యక్రమంలో శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

ఎస్సీవీ నాయుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని సుధీర్ రెడ్డి అన్నారు. గతంలో నాయుడు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాక వైఎస్సార్ సీఎం అయ్యారు. వైసీపీలో చేరాక జగన్ సీఎం అయ్యారు. ఇప్పుడు ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరారు.. చంద్రబాబు సీఎం కావడం ఖాయం అని సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Also Read.. Pawan kalyan : పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో జగన్‌లో డిప్రషన్, అది ఆయన మాటల్లోనే తెలుస్తోంది : గాదె వెంకటేశ్వరరావు

” ఎస్సీవీ నాయుడు లక్కీ స్టార్. చంద్రబాబు నాకు తండ్రి సమానుడు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిందే. గతంలో నాన్న ఆరోగ్యం దృష్ట్యా హైదరాబాద్ లో ఉన్నాను. ఇకపై శ్రీకాళహస్తిలోనే ఉంటాను. నేను మారాను. గ్రామ గ్రామాన తిరుగుతాను. నా భార్య కూడా పార్టీ కోసం మండలాల్లో తిరుగుతోంది.

Also Read..Nara Lokesh: ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే ముందుగా ఈ పని చేస్తాం: నారా లోకేశ్

వైసీపీ నేతలు పార్టీ కార్యకర్తలను హింసించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. అందరి సంగతి తేలుస్తాం. పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఓ ఆరు నెలల పాటు మమ్మల్ని వదిలేయండి. కొన్ని పొరపాట్లు జరిగాయి. సర్దుకుని అంతా కలిసి పని చేద్దాం” అని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.