Chandrababu Naidu : అన్నీ లెక్క పెడుతున్నా, వడ్డీతో సహా చెల్లిస్తాం- చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Chandrababu Naidu : ఈ రాష్ట్రం జగన్ జాగీరా? టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచిదంతా కక్కిస్తా.

Chandrababu Naidu : అన్నీ లెక్క పెడుతున్నా, వడ్డీతో సహా చెల్లిస్తాం- చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Chandrababu Naidu (Photo : Twitter)

Updated On : June 14, 2023 / 8:57 PM IST

Chandrababu – Kuppam : కుప్పం నియోజకవర్గ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా చెలరేగిపోయారు. సీఎం జగన్ పాలనపై ధ్వజమెత్తారు. అన్నీ లెక్క పెడతున్నా.. వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

” వైసీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. సీఎం జగన్ అంత అవినీతిపరుడు దేశంలో ఎవరూ లేరని సాక్ష్యాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సీఎం అవినీతిపై ప్రకటన చేయడం కాదు, చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలి?

Also Read..Amit Shah in South: అమిత్‌షా ఏమన్నారో విన్నారా.. సౌత్‌లో బీజేపీకి 80 ఎంపీ సీట్లు సాధ్యమేనా?

నా నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుంటూ ఉంటే అనుమతులు ఎందుకివ్వరు? ఈ రాష్ట్రం జగన్ జాగీరా? మీ నాయన సొత్తా? కుప్పంలో గ్రానైట్ దోపిడీ చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచిదంతా కక్కిస్తా. ఖబడ్దార్. 2వేల రూపాయల నోట్లు వైసీపీ నేతలు బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారు.

సంక్షేమ పథకాలను కుప్పం నుంచే ప్రారంభిస్తా. ప్రశాంతమైన కుప్పంలో రౌడీలతో బెదిరిస్తున్నారు. రౌడీలను అణిచివేసే బాధ్యత నాది. అన్నీ లెక్కపెడుతున్నా. వడ్డీతో సహా చెల్లిస్తాం. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలను, కార్యకర్తలను జైలుకు పంపిన వారిని వదిలేది లేదు” అని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు.