మా కడుపు కొట్టారు : అమరావతి ప్రాంత మహిళలు కన్నీటిపర్యంతం
రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి గ్రామాల్లో 10 రోజు(డిసెంబర్ 27,2019) కొనసాగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి మూడు రాజధానులు

రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి గ్రామాల్లో 10 రోజు(డిసెంబర్ 27,2019) కొనసాగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి మూడు రాజధానులు
రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి గ్రామాల్లో 10 రోజు(డిసెంబర్ 27,2019) కొనసాగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి మూడు రాజధానులు ప్రకటనపై భావోద్వేగానికి గురైన మహిళలు కన్నీటిపర్యంతం అయ్యారు. తమ బిడ్డల బంగారు భవిష్యత్‌ను కోరుకుని మూడు పంటలు పండే భూములను ఇస్తే రాజధాని తరలింపు ప్రతిపాదన తమను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వెలిబుచ్చారు.
బంగారు భవిష్యత్తు కోసం భూములిచ్చాం:
అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. రాజధాని తరలిపోతోందన్న బెంగతో రాజధాని ప్రాంత మహిళలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే ఇప్పుడు తరలిస్తే తమ పరిస్థితి దయనీయంగా మారిపోతుందని కన్నీటిపర్యంతం అయ్యారు. పది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా వైసీపీ సర్కార్ అర్థం చేసుకోకుండా మొండిగా వ్యవహరిస్తోంది మండిపడ్డారు.
జగన్ మా బతుకులను వీధికి ఈడ్చారు:
ఆందోళన చేస్తున్న రైతులను హేళన చేస్తున్న వైసీపీ నేతలపై మందడం మహిళలు మండిపడ్డారు. రాజధానికి భూములిచ్చిన తమ బతుకులను జగన్ వీధికి ఈడ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరులో మహిళలు ధర్నా చేశారు. రాజధాని తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తుళ్లూరు, మందడం ప్రాంతాలకు చెందిన యువకులను పోలీసులు అరెస్ట్ చేయడంపై మహిళలు మండిపడ్డారు. ఏం తప్పు చేశారని అరెస్ట్ చేశారని నిలదీశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిసెంబర్ 27న గంట సేపు మౌనదీక్ష చేశారు. రాజధాని తరలిస్తే జగన్ ప్రభుత్వం తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చించారు.
రాజధాని తరలిస్తే ఊరుకోము:
మంగళరిగి రూరల్ మండలం ఎర్రబాలెంలో రైతులు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని తరలింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌తోపాటు తెలుగుదేశం కార్యక్తలను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. మూడు రాజధానులు ప్రతిపాదనను ఉపసంహరించుకుని, అమరావతిలోనే కేపిటల్ కొససాగించే వరకు ఉద్యమాన్ని ఆపకూడదని అమరావతి ప్రాంత రైతులు నిర్ణయించారు. శనివారం(డిసెంబర్ 28,2019) నుంచి మరింత ఉధృతం చేయాలని తలపెట్టారు.
* అమరావతిలో పదవ రోజు కొనసాగిన ఆందోళనలు
* నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లిన రాజధాని గ్రామాలు
* ఆందోళనకారుల బైఠాయింపులతో పరిస్థితి ఉద్రిక్తం
* రాజధానిని తరలిస్తే సహించబోమని హెచ్చరించిన రైతులు
* మూడు రాజధానుల ప్రకటనపై మహిళల భావోద్వేగం
* కన్నీటి పర్యంతమైన మందడం, తుళ్లూరు మహిళలు
* రాజధాని గ్రామాల యువకులను అరెస్టు చేసిన పోలీసులు
Also Read : రైతులను కాదంటే.. వారి శవాల మీద నుంచి రాజధానిని తీసుకువెళ్ళాలి