బైక్‌పై చక్కర్లు కొట్టి.. ఉట్టి కొట్టి.. డ్యాన్స్ చేసి.. అదరగొట్టిన అంబటి రాంబాబు

Holi 2024: హోలీ పండుగలో అంబటి రాంబాబు చిందులేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

బైక్‌పై చక్కర్లు కొట్టి.. ఉట్టి కొట్టి.. డ్యాన్స్ చేసి.. అదరగొట్టిన అంబటి రాంబాబు

Ambati Rambabu in Holi Celebrations

Updated On : March 25, 2024 / 4:50 PM IST

బైక్‌పై చక్కర్లు కొట్టి.. ఉట్టి కొట్టి.. డ్యాన్స్ చేసి.. ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు అదరగొట్టారు. పల్నాడు జిల్లాలో హోలీ సంబరాల్లో అంబటి పాల్గొని ప్రజలతో మమేకమవుతూ సరదాగా గడిపారు. సత్తెనపల్లి సుగాలి కాలనీలో హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మొదట స్వయంగా బైక్ నడిపుతూ గ్రామంలో కలియతిరిగారు.

హోలీ వేళ ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టి, గిరిజన మహిళలతో డ్యాన్స్ చేశారు. అంబటి రాంబాబు గతంలోనూ పలు వేడుకల్లో డ్యాన్స్ చేసి అలరించారు. ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొంటూ ఒత్తిడితో గడుపుతున్న అంబటి రాంబాబు ఇవాళ మాత్రం ఎంతో హుషారుగా కనపడడం గమనార్హం.

హోలీ పండుగలో అంబటి రాంబాబు చిందులేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తండా వాసులు మంత్రి అంబటి రాంబాబుపై హోలీ రంగులు చల్లారు. కాగా, దేశ వ్యాప్తంగా ఇవాళ హోలీ సంబరాలు ఆకాశాన్నంటేలా జరుగుతున్నాయి. రంగులు చల్లుకుంటూ ఈ పండుగలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు.

Also Read: 10టీవీ కథనాలకు స్పందించిన ఎంపీ అసదుద్దీన్