Anam Ramanarayana Reddy : లోకేష్ పాదయాత్రకే వణికిపోతే.. చంద్రబాబు యాత్ర, పవన్ వారాహి యాత్ర చేస్తే ఏం చేస్తారు : ఆనం

టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీకి సిద్ధమని చెప్పారు. పోటీ చేయకుండా జిల్లాలో అన్ని స్థానాల గెలుపు కోసం పనిచేయమన్నా తాను సిద్ధమేనని తెలిపారు.

Anam Ramanarayana Reddy : లోకేష్ పాదయాత్రకే వణికిపోతే.. చంద్రబాబు యాత్ర, పవన్ వారాహి యాత్ర చేస్తే ఏం చేస్తారు : ఆనం

Anam Ramanarayana Reddy

Updated On : June 25, 2023 / 1:33 PM IST

Anil Kumar Comments : నారా లోకేష్ యాత్ర పై వైసీపీ నేతలు అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర చూస్తే కొంతమంది అయోమయ పరిస్థితిలోకి వెళ్లారని తెలిపారు. “మీకు పోటీగా ఉన్నారని స్వపక్షంలో ఉన్న నేతలపై కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు” అని పేర్కొన్నారు. ఆఖరికి స్త్రీల గురించి కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు నెల్లూరులో ఎప్పుడూ లేవన్నారు.

ఈ మేరకు ఆదివారం ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోకేష్ యువగళo తోనే ప్రజాగలం తెలుసుకుంటున్నారని చెప్పారు. లోకేష్ పాదయాత్రకే వణికిపోతే..చంద్రబాబు యాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వేస్తే ఏం చేస్తారని తెలిపారు. అనిల్ వ్యాఖ్యలకు ఆనం కౌంటర్ ఇచ్చారు. విమర్శలను సరిదిద్దుకోవాలని.. బూతు పంచాంగం కాదని హితవు పలికారు.

Anil Kumar : చరిత్ర లేని నేతలు నాపై విమర్శలు చేస్తున్నారు : అనిల్ కుమార్

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను మీ వెంట పెట్టుకున్న వారిని రాజీనామా చేయించారా ? అని నిలదీశారు. అక్రమ సంపాదన కోసం పక్కనే ఉన్నారు.. తమకు ఆ అవసరం లేదన్నారు. తన రాజీనామా అడిగే ముందు వాళ్ళతో రాజీనామా చేయించాలని సూచించారు.  తనపై పోటీ చేయాలన్న అనిల్ సవాల్ కి ఆనం కౌంటర్ ఇచ్చారు. ఆరు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచానని పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీకి సిద్ధమని చెప్పారు. పోటీ చేయకుండా జిల్లాలో అన్ని స్థానాల గెలుపు కోసం పనిచేయమన్నా తాను సిద్ధమేనని తెలిపారు. తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయ జీవితం నెల్లూరుతోనే మొదలైందన్నారు. అవకాశం ఉంటే నెల్లూరు నుంచి ఒకసారి పోటీ చేయాలని అనుకున్నానని తెలిపారు. ఎక్కడ తన రాజకీయం మొదలైందో.. అక్కడే ముగించాలని భావించానని.. ఇది తన ఉద్దేశ్యమని చెప్పారు.