Anandaiah Medicine: అక్రమంగా ఆనందయ్య మందు అమ్మకం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య ముందుకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొందరు హైదరాబాద్ నుంచి కార్లలో వెళ్లి ఆనందయ్య మందు తెచ్చుకుంటున్నారు

Anandaiah Medicine: అక్రమంగా ఆనందయ్య మందు అమ్మకం

Anandaiah Medicine (3)

Updated On : June 13, 2021 / 4:20 PM IST

Anandaiah Medicine: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య ముందుకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొందరు హైదరాబాద్ నుంచి కార్లలో వెళ్లి ఆనందయ్య మందు తెచ్చుకుంటున్నారు. ఈ మందు డిమాండును గమనించిన కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆనందయ్య మందు పేరుతో అక్రమంగా అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబందించిన వివరాలను తాడికొండ ఎస్ఐ మీడియాకు తెలిపారు.

తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన కాంతారావు (48) అనే ఆనందయ్య మందు పేర పసరు మందు అమ్ముతున్నాడు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి మందు తెచ్చి అమ్ముతున్నానని స్నానికులకు చెప్పాడు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కో ప్యాకెట్ కు రూ.2000 చెల్లించి తీసుకున్నారు. అయితే అక్రమంగా ఆనందయ్య మందు అమ్ముతున్నారంటూ తమకు సమాచారం రావడంతో మోతడక గ్రామానికి వెళ్లి కాంతారావును అదుపులోకి తీసుకున్నట్లు తాడికొండ ఎస్ఐ తెలిపారు.

విచారణలో 750 ప్యాకెట్ల మందు అమ్మినట్లు కాంతారావు తెలిపాడని ఎస్ఐ వివరించాడు. ఒక్కో ప్యాకెట్ ను రూ. 2000 వేలకు విక్రయించాడని తెలిపాడు. అతడి నుంచి లక్ష 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. ఎవరైనా ఆనందయ్య మందు అంటు అమ్మకాలు చేపడితే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు ఎస్ఐ..