AP 10th Class Results 2023 : ఏపీ 10th క్లాస్ పరీక్షా ఫలితాలు విడుదల .. టాప్‌లో మన్యం జిల్లా, లాస్ట్‌లో నంద్యాల..
ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పరీక్ష ఫలితాలను మంత్రి బొత్సా సత్యనారాయణ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 72.26 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించగా వీరిలో పైచేయి బాలికలదేనని తెలిపారు.

AP 10th Class Results 2023
AP 10th Class Results 2023 : ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పరీక్ష ఫలితాలను మంత్రి బొత్సా సత్యనారాయణ విడుదల చేశారు. విజయవాడలోని ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయంలో ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్, విద్యాశాఖ అధికారులతో కలిసి మంత్రి బొత్సా 2022-2023 ఏడాది టెన్త్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్షల్లో మొత్తం 72.26 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించగా వీరిలో పైచేయి బాలికలదేనని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన జిల్లాలో టాప్ లో పార్వతి పురం మన్యం జిల్లా ఉండగా చివరిస్థానంలో నంద్యాల జిల్లా ఉందని తెలిపారు. ఉత్తీర్ణతలో బాలురు 69.27 శాతం ఉండగా బాలికలు 75.38 శాతం మంది ఉన్నారని వెల్లడించారు. బాలురకంటే బాలికలు 6.11 శాతం ఎక్కువమంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉత్తీర్ణులయిన విద్యార్థులకు మంత్రి బొత్సా అభినందనలు తెలిపారు.
రీ కౌంటింగ్, వెరిఫికేషన్ కోసం మే 13 వరకు అవకాశం ఉందని డౌట్ ఉన్నవారు వెరిఫికేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. జూన్ 2 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. మొత్తం 933 స్కూల్స్ లో 100శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కాగా 10th క్లాస్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా.. వీరిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807మంది ఉన్నారు. పరీక్షా ఫలితాల్లో ప్రతీ ఏటావలెనే ఈఏడాది కూడా బాలికలే ఉత్తీర్ణత శాతంలో ఎక్కువంది ఉన్నారు.
జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు 10th సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని..సప్లిమెంటరీ పరీక్షలకు May 17లోగా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు 13 వరకు గడువు ఉంటుందని తెలిపారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ www.results.bse.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు.
కాగా ఎక్కువ ఉత్తీర్ణత సాధించిన పార్వతీపురం మన్యం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి కొత్త జిల్లాగా మారింది. ఉత్తీర్ణత శాతంలో చివరిగా నిలిచిన నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి విడి కొత్త జిల్లాగా మారింది.