AP 10th,inter Exam schedule 2022 : ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ 10th, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.10th‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలను మంత్రులు విడుదల చేశారు.

AP 10th,inter Exam schedule 2022 : ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Ap 10th Inter Exam Schedule 2022 Relesed

Updated On : February 10, 2022 / 3:39 PM IST

AP 10th,inter Exam schedule 2022 : ఆంధ్రప్రదేశ్‌ 10th, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.10th‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలను మంత్రులు విడుదల చేశారు. విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇక విద్యార్ధులంతా పరీక్షల హడావిడిలో కుస్తీలు పట్టనున్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌..
ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పరీక్షల షెడ్యూల్ గురించి వివరిస్తూ..
మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరిక్షలు జరుగుతాయని 1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫస్ట్ ఇయర్ 5,05,052 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారని తెలిపారు.

10th పరీక్షల షెడ్యూల్..
10th పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2022 మే 2 నుంచి మే13 వరకు 10th తరగతి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల సమయం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి సురేష్‌ తెలిపారు.