Mudragada padmanabham : మళ్లీ రాజకీయాల్లో ముద్రగడ .. ఏ పార్టీయో ఫిక్స్ అయ్యారా..? కాపు ఓట్లే లక్ష్యంగా బరిలో దిగనున్నారా?

కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఖారారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ కాపు ఉద్యం నేత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటు ప్రకటించారు. త్వరలో రాజకీయాల్లో వస్తానంటూ ప్రకటించారు. దీంతో ముద్రగడ ఏపార్టీలో చేరతారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Mudragada padmanabham : మళ్లీ రాజకీయాల్లో ముద్రగడ .. ఏ పార్టీయో ఫిక్స్ అయ్యారా..? కాపు ఓట్లే లక్ష్యంగా బరిలో దిగనున్నారా?

Mudragada padmanabham

Updated On : May 10, 2023 / 12:29 PM IST

Mudragada padmanabham : కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఖారారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ కాపు ఉద్యం నేత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటు ప్రకటించారు. త్వరలో రాజకీయాల్లో వస్తానంటూ ప్రకటించారు. దీంతో ముద్రగడ ఏపార్టీలో చేరతారు? అనేది ఆసక్తికరంగా మారింది. బహుశా ఆయన వైసీపీలోనే చేరతాను అనే మాట బలంగా వినిపిస్తోంది.

ఎందుకంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ల గురించి డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన ఆందోళనల్లో తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనానికి కారణమైంది. ఈ ఘటనలో ముద్రగడపై పలు కేసులు నమోదు అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముద్రగడపైనా..తుని ఘటనపై నమోదు అయిన కేసులన్నీ ఎత్తివేసింది. దీంతో ముద్రగడ స్వయంగా వెళ్లి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈక్రమంలో ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ వైసీపీలోనే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. దీంట్లో భాగంగానే వైసీపీ కాపు ఓట్లే లక్ష్యంగా ముద్రగడను రంగంలోకి దింపుతోందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కాపు ఓట్లే లక్ష్యంగా ముద్రగడ రీ ఎంట్రీ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగ లేఖ రాస్తూ త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ పొలిటికల్ రీ ఎంట్రీ గురించి హింట్ ఇచ్చారు. ప్రజల్లో మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడిన ముద్రగడి ప్రజలు మార్పు వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుందన్నారు. ఉద్యమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పుడు రాలేదని తెలిపారు. 2016లో తుని ఘటన తరువాత తనను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించానికి యత్నాలు జరిగాయని దాని కోసం మెలికాప్టర్ ను రెడీ ఉంచారు అంటూ పరోక్షంగా టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేఖ రాశారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని.. ప్రజల్లో మార్పు రావాల్సి ఉందన్నారు. ఉద్యమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎప్పుడు రాలేదన్నారు. నా జాతి రిజర్వేషన్ జోకరు కార్డులా అయినందుకు భాధ పడుతున్నానని.. పేదవారి కోసం తాను చేసే ఉద్యమాలు వారి చిరునవ్వే తనకు ఆక్సిజన్ అన్నారు. కాగా గతంలో జనసేన, బీజేపీ నేతలు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపారు. కానీ ఆయన నుంచి ఎటువంటి సానుకూలతరాలేదు. ఈక్రమంలో అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ముద్రగడ రాజకీయ ప్రవేశం అంటూ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్, టీడీపీలలో పనిచేశారు. ఆ తర్వాత ఈ రెండు పార్టీలకు దూరంగా ఉన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే క్రమంలో తుని ఘటనతో ఆయనపై పలు వివాదాలకు కారణమైంది. రాష్ట్ర విభజన తర్వాత కాపు రిజర్వేషన్ల విషయంలో ముద్రగడ పద్మనాభం తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తు టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ఆయన పోరాటాన్ని ఉదృతం చేశారు. కానీ తుని ఘటనతో కేసులు నమోదు కావటంతో చల్లబడిపోయారు. తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్ కేసుల్ని ఎత్తివేసిన కఠిన మైన రైల్వే చట్టాల కారణంగా ఈ కేసుల నుంచి పూర్తి స్థాయి విముక్తి రానట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి సుమారు 12 శాతానికి పైగా ఓటర్లుంటారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములను కాపు సామాజిక ఓటర్లు ప్రభావితం చేయనున్నారు. దీంతో కాపు సామాజిక వర్గం ఓటర్లను తమ వైపునకు తిప్పుకనేందుకు ఏపీలోని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకత..మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే కాపు ఓట్లు మరింతగా కీలకం కానున్నాయి. ఈక్రమంలో ముద్రగడ ఎన్నికల బరిలోకి దిగితే కాపు ఓట్లు ఎవరికి పడతాయి? ముద్రగడ చేసే పార్టీకా? లేదా పవన్ కల్యాణ్ కా? ఇటువంటి పరిస్థితుల్లో ముద్రగడ రాజకీయ రీ ఎంట్రీ అత్యంత కీలకం కానుంది. ఆయన ఏ పార్టీలోకి చేరతారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఏపీలో కాపు ఓట్లు కీలక జిల్లాలో కీలకంగా ఉన్నాయి.