Andhra Pradesh Coronavirus : ఏపీలో కొత్తగా 3,040 కరోనా కేసులు .. 14 మంది మృతి
శుక్రవారం ఏపీలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 3 వేల 040 మందికి కరోనా సోకింది. 14 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Andhra Pradesh Coronavirus (3)
Andhra Pradesh Coronavirus : శుక్రవారం ఏపీలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 3 వేల 040 మందికి కరోనా సోకింది. 14 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీలో ప్రస్తుతం 30 వేల 300 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 12 వేల 960 మంది మృతి చెందారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 659 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 19,17,253 పాజిటివ్ కేసులకు గాను 18,73,993 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :
తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా, అనంతపూర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.
జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 85. చిత్తూరు 441. ఈస్ట్ గోదావరి 659. గుంటూరు 211. వైఎస్ఆర్ కడప 158. కృష్ణా 242. కర్నూలు 77. నెల్లూరు 273. ప్రకాశం 316. శ్రీకాకుళం 106. విశాఖపట్టణం 130. విజయనగరం 45. వెస్ట్ గోదావరి 297. మొత్తం : 3040