Road Accident: చిత్తూరు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. మరో ప్రమాదంలో ముగ్గురు!
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Road Accident Nalgonda District
Road Accident: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళ కూడా ఉన్నారు.
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో మరో రోడ్డు ప్రమాదం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మార్చాల సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడగా.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడగా.. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు.
మృతులు మహబూబాబాద్‌కు చెందిన కిరణ్మయి (22), పిఎ పల్లికి చెందిన శిరీష (20), కొండమల్లే పల్లి అన్నేపక అరవింద్ (23)గా పోలీసులు గుర్తించారు.