Vishwa Bhushan : ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్.. ఆరోగ్యపరిస్థితిపై సీఎం జగన్ ఆరా

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Vishwa Bhushan : ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్.. ఆరోగ్యపరిస్థితిపై సీఎం జగన్ ఆరా

Vishwa Bhushan

Updated On : November 17, 2021 / 6:43 PM IST

Vishwa Bhushan : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 88 ఏళ్ల హరిచందన్ ఈ ఉదయం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో, ఆయనను విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో తరలించారు.

చదవండి : AP Governor: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. విమానంలో హైదరాబాద్‌కు తరలింపు

ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. అయితే గవర్నర్‌కు నవంబర్ 15న కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.

చదవండి : Biswabhusan Harichandan : ఆంధ్ర గవర్నర్‌ను పరామర్శించిన తెలంగాణ గవర్నర్

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్‌, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డితో సీఎం నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సీఎం జగన్‌కు తెలిపారు