Andhra Pradesh : విద్యార్థులకు అలర్ట్.. స్కూల్ సమయాల్లో మార్పు, కొత్త టైమింగ్స్ ఇవే

Andhra Pradesh : వడగాల్పులు, ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా స్కూల్ సమయాల్లో మార్పు చేసింది ప్రభుత్వం.

Andhra Pradesh : విద్యార్థులకు అలర్ట్.. స్కూల్ సమయాల్లో మార్పు, కొత్త టైమింగ్స్ ఇవే

Andhra Pradesh Schools

Updated On : June 11, 2023 / 5:14 PM IST

Andhra Pradesh – School Timings : స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి. రేపటి (జూన్ 12) నుంచి ఏపీలో పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. షెడ్యూల్ ప్రకారమే స్కూళ్లను పున:ప్రారంభించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

అయితే, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ సమయాల్లో మార్పు చేసింది. వడగాల్పులు, ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా స్కూల్ సమయాల్లో మార్పు చేసింది ప్రభుత్వం. ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 7.30గంటల నుంచి 11.30 గంటల వరకే తరగతులు నిర్వహిస్తారు. ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు ఉంటాయి.

Also Read..AP Government : ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో.. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచేందుకు మార్గదర్శకాలు జారీ

వేసవి సెలవులు ముగిశాయి. పిల్లలు తిరిగి స్కూల్ బాట పట్టనున్నారు. ఏపీలో సోమవారం నుంచే స్కూల్స్ రీ-ఓపెన్ కానున్నాయి. అయితే, వేడిగాలలు-ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, పిల్లలు ఇబ్బందులు పడతారని, ఈ కారణంగా స్కూల్స్ రీఓపెన్ తేదీని వాయిదా వేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీనిపై జగన్ సర్కార్ స్పందించింది.

స్కూళ్ల రీఓపెన్ లో మార్పు చేయలేదు కానీ, ఒంటి పూట బడుల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ఇబ్బంది లేకుండా స్కూల్ సమయాల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ఇక, ఉదయం 8.30-9.30 గంటల మధ్య పిల్లలకు రాగి జావ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read..Andhra Pradesh: జగనన్న విద్యా కానుక.. విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం