Andhra Pradesh: జగనన్న విద్యా కానుక.. విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు మూడు జతల చొప్పున యూనిఫామ్ ఇవ్వాలని తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Andhra Pradesh: జగనన్న విద్యా కానుక.. విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Jagananna Vidya Kanuka

Jagananna Vidya Kanuka: విద్యార్థుల‌కు (students) ఏపీ ప్రభుత్వం (AP government)  శుభవార్త చెప్పింది. స్కూళ్లు ప్రారంభమైన రోజునుంచే విద్యార్థులకు జగన్న విద్యాకానుక (Jagananna Vidya Kanuka)  ను అందించనున్నారు. ఈ పథకం కింద సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు యూనిఫాం (Uniform) లతో పాటు బూట్లు, సాక్సులు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లీష్, తెలుగు (బైలింగ్వల్) టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలను ప్రభుత్వం అందిచడం జరుగుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించిన విషయం తెలిసిందే.

Jagananna Vidya Kanuka : జగనన్న విద్యా కానుక.. కిట్లలో విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే..

జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు మూడు జతల చొప్పున యూనిఫామ్ ఇవ్వాలని తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో క్లాత్ సరిపోలేదని ఫిర్యాదులు రావడంతో ఈసారి విద్యార్థులందరికీ ఇచ్చే క్లాంత్‌ను 23శాతం నుంచి 60శాతం వరకు అదనంగా అందిస్తున్నారు. దీని ప్రకారంచూస్తే.. 1 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 1.25 మీటర్ల నుంచి 3.30 మీటర్ల ప్యాంట్ క్లాంత్. 1.80 మీటర్ల నుంచి 3.30 మీటర్ల చొక్కా క్లాత్ అందిస్తున్నారు. బాలికలకు 3.60 మీటర్ల నుంచి 3.80 మీటర్లు గౌను లేదా చుడీదార్ బాటమ్. 2.10 మీటర్ల నుంచి 4.20 మిటర్లు చొక్కా లేదా చుడీదార్ టాప్ క్లాత్ అదనంగా అందించనున్నారు.

Amazon forest: అమెజాన్ దట్టమైన అడవిలో పిల్లల ఆచూకీ ఎలా దొరికిందంటే…

ఇదిలాఉంటే చొక్కా లేదా నిక్కర్, గౌను, ప్యాంటు, చుడీదార్ ఇలా బాలురు, బాలికలకు రెండు రంగుల్లో యూనిఫాం ఇస్తున్నప్పటికీ తరగతులను బట్టి డిజైన్ ను ఎంపిక చేశారు. వీటిలో 1-7 తరగతుల బాలురకు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, నిక్కర్, 8-10 తరగతుల విద్యార్థులకు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, ఫుల్ ప్యాంట్. అదేవిధంగా 1, 2 తరగతుల బాలికలకు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, స్కర్ట్, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, స్కర్ట్, 6 నుంచి 10వ తరగతి విద్యార్థినిలకు చున్నీ, చుడీదార్ అందించనున్నారు.