Chandrababu Arrest : కొనసాగుతున్న ఉత్కంఠ.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
కౌంటర్ చదివారా అని ధర్మాసనం పిటిషనర్ కౌన్సిల్ కి అడిగింది. దానికి కొంచెం టైమ్ కావాలని పిటిషనర్ కౌన్సిల్ వాళ్లు అడిగారు. Chandrababu Bail Petition

Chandrababu Bail Petition
Chandrababu Bail Petition : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ వాయిదా పడింది. బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం(సెప్టెంబర్ 19) విచారించిన ఏపీ హైకోర్టు.. గురువారానికి కేసును వాయిదా వేసింది. చంద్రబాబు తరపు అడ్వకేట్ల మేరకే బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు 21వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసుకి సంబంధించి హైకోర్టు అడ్వకేట్ చంద్రశేఖర్ స్పందించారు. ”ఇది రెగులర్ బెయిల్ పిటిషన్. దీనిపై ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా వర్చువల్ గా ఈ కేసులో పాల్గొన్నారు. హైకోర్టు సీనియర్ కౌన్సిల్, మిగతా కౌన్సిల్ కూడా పాల్గొన్నారు. కౌంటర్ చదివారా అని ధర్మాసనం పిటిషనర్ కౌన్సిల్ కి అడిగింది. దానికి కొంచెం టైమ్ కావాలని పిటిషనర్ కౌన్సిల్ వాళ్లు అడిగారు. శుక్రవారం అయితే తాను పూర్తిగా వాదనలను వినిపించగలను అని లూథ్రా చెప్పారు.
పిటిషనర్ కౌన్సిల్ హైకోర్టు వాళ్లు రేపు, ఎల్లుండి అయినా పర్లేదు అని చెప్పారు. దాంతో హైకోర్టు ధర్మాసనం బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున మధ్యాహ్నం 2గంటల 15కి నిమిషాలకు పూర్తి వాదనలు వింటామంది. ప్రభుత్వ తరపు న్యాయవాదులు తమ వెర్షన్ ను కౌంటర్ లో పొందుపరిచారు. దాని గురించి వాదనలు వినాల్సి ఉంది. అది 21వ తేదీన తెలుస్తుంది” అని న్యాయవాది చంద్రశేఖర్ వెల్లడించారు.
Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరుపై అభ్యంతరాలు ఉన్నాయని లూథ్రా వాదించారు. ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ 2018 సవరణ కంటే ముందు నమోదై ఉంటే అడిగేవాళ్లం కాదని, కానీ ఎఫ్ఐఆర్ 2020లో నమోదు కావడంతో చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అన్నారు. 2020లో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఇలానే జరిగిందన్నారు. కర్నాటక కేసును ఉదహరించిన లూథ్రా.. అరెస్ట్ చేయాలంటే ముందస్తు అనుమతి అవసరం అని వాదించారు.