AP Shutdown-Day Curfew : ఏపీ షట్‌డౌన్.. డే కర్ఫ్యూ మొదలైంది.. వేటికి ఆంక్షలు.. మినహాయిపులంటే?

ఆంధప్రదేశ్ షట్ డౌన్ అయింది. బుధవారం (మే 5) నుంచి రాష్ట్రంలో డే కర్ఫ్యూ అమల్లోకొచ్చింది. ఉదయం 6 గంటల వరకు కొనసాగనున్న కర్ఫ్యూ కొనసాగనుంది. మొత్తం 18 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది.

AP Shutdown-Day Curfew : ఏపీ షట్‌డౌన్.. డే కర్ఫ్యూ మొదలైంది.. వేటికి ఆంక్షలు.. మినహాయిపులంటే?

Andhra Pradesh Day Curfew Start From Today

Updated On : May 5, 2021 / 1:43 PM IST

AP Shutdown-Day Curfew : ఆంధప్రదేశ్ షట్ డౌన్ అయింది. బుధవారం (మే 5) నుంచి రాష్ట్రంలో డే కర్ఫ్యూ అమల్లోకొచ్చింది. ఉదయం 6 గంటల వరకు కొనసాగనున్న కర్ఫ్యూ కొనసాగనుంది. మొత్తం 18 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది. డే కర్ఫ్యూతో ప్రజారవాణా ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులను కూడా అధికారులు మూసివేశారు. ఇతర రాష్ట్రాలకు రాకపోకలు బందయ్యాయి. బార్డర్ చెక్ పోస్టుల వద్ద పోలీసుల మోహరించారు. డే కర్ఫ్యూతో పలు దుకాణాలు మూతపడ్డాయి. కర్ఫ్యూ సమయంలో కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉండనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి.

ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. డే కర్ఫ్యూకు సంబంధించి ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు. పాక్షిక లాక్‌డౌన్‌లో భాగంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ సమయంలో ఏపీలో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు విధించినట్లు ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంది. ఇవాళ్టి నుంచి 16 గంటలు కఠిన ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.బ్యాంకు సేవలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. జాతీయ రహదారుల పనులు కొనసాగించేందుకు అనుమతినిచ్చింది. పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఏపీలో ఏయే ప్రాంతాల్లో ఆంక్షలు, వేటికి అనుమతి, మినహాయింపులు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
ఆంక్షలు… :

  • అన్ని సంస్థలు, షాపులు
  • కార్యాలయాలు, విద్యా సంస్థలు
  • ఆర్టీసీ బస్సులు, ఆటోలు
  • అంతర్రాష్ట్ర సరిహద్దులు
  • హోటళ్లు, బార్లు, మద్యం దుకాణాలు
  • కిరాణ దుకాణాలు, షాపింగ్ మాల్స్
  • సినిమా థియేటర్లు

మినహాయింపులు :

  • ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా, టెలీకమ్యూనికేషన్
  • పెట్రోలు పంపులు, ఎల్ పీజీ, సీఎన్‌జీ, గ్యాస్ విక్రయ కేంద్రాలు
  • విద్యుత్ ఉత్పత్తి, నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు
  • అంబులెన్స్, ఎమర్జెన్సీ వాహనాలు, వ్యాక్సిన్ కోసం వెళ్లేవారు
  • వ్యవసాయ పనులు
  • అత్యవసర సేవలందించే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
  • మెడికల్ షాప్స్, ఆస్పత్రులు, వైద్యారోగ్య సిబ్బంది