AP Covid Update : ఏపీలో కొత్తగా 165 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా  165 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.

AP Covid Update : ఏపీలో కొత్తగా 165 కోవిడ్ కేసులు

AP Covid Updates

Updated On : January 2, 2022 / 6:20 PM IST

AP Covid Update :  ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా  165 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 130 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,260 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77,486 కి చేరింది. వీరిలో 20,61,729 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల నిన్న కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కోక్కరు చొప్పున మరణించారు.
Also Read : Chittoor District : రామకుప్పంలో ఉద్రిక్తత-అంబేద్కర్, ఉయ్యాలవాడ విగ్రహాల స్ధాపనలో వివాదం
దీంతో ఇంతవరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 14,497 కి చేరింది. ఇంత వరకు రాష్ట్రంలోని 3,13,82,067 మంది శాంపిల్స్ ను పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.