ఏపీలో కొత్తగా 1221 కోవిడ్ పాజిటివ్ కేసులు

  • Published By: murthy ,Published On : November 20, 2020 / 06:33 PM IST
ఏపీలో కొత్తగా 1221 కోవిడ్ పాజిటివ్ కేసులు

Updated On : November 20, 2020 / 7:41 PM IST

Andhra pradesh reports 1221 new positive cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత24 గంటల్లో 1,221 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయయని ప్రభుత్వం తెలిపింది.గడిచిన 24 గంటల్లో 66,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 1221మంది కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కరోనా వైరస్ కారణంగా గడిచిని 24 గంటల్లో చిత్తూరు,కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, గుంటూరు,కర్నూలు,నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరొక్కరు చొప్పన మరణించారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా 1,829 మంది కోవిడ్ నుంచి కోలుకుని నిన్న డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లారని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 94,74,870 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 15,382 యాక్టివ్ కేసులు చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటికి 6,920 కి చేరింది.
ap covid report