Vangaveeti Radha: రాధ చుట్టూ బెజవాడ రాజకీయం.. చంద్రబాబుతో భేటీ!

తనను చంపేందుకు ఎవరో రెక్కీ చేశారన్నారు. ప్రభుత్వం గన్ మెన్లు కేటాయిస్తే వద్దన్నారు. తనను తన అభిమానులే రక్షిస్తారని చెప్పారు.

Vangaveeti Radha: రాధ చుట్టూ బెజవాడ రాజకీయం.. చంద్రబాబుతో భేటీ!

Radha

Updated On : December 30, 2021 / 9:26 AM IST

Vangaveeti Radha: తనను చంపేందుకు ఎవరో రెక్కీ చేశారన్నారు. ప్రభుత్వం గన్ మెన్లు కేటాయిస్తే వద్దన్నారు. తనను తన అభిమానులే రక్షిస్తారని చెప్పారు. కానీ.. చంద్రబాబు మాత్రం.. వంగవీటి రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఇప్పుడు బెజవాడ రాజకీయమంతా.. రాధా చుట్టే తిరుగుతోంది.

అయితే, వంగవీటి రాధా ఇప్పటివరకు పోలీసులకు రాతపూర్వకంగా కంప్లైంట్ చేయలేదు. అయినప్పటికీ, పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు వంగవీటి రాధాకృష్ణకు గన్‌మెన్ల అంశంలో హైడ్రామా నెలకొంది. నిన్న కూడా రాధాకృష్ణ ఆఫీస్‌కు గన్‌మెన్లు వెళ్లారు.

అయితే రాధా అనుచరులు గన్‌మెన్‌లు అవసరం లేదనగా.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే తాము పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవాళ్టి నుంచి ఇద్దరు గన్‌మెన్లను పంపే అవకాశాలున్నాయి.

మరోవైపు రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రాధాకు ఫోన్ చేసి ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్లను తిరస్కరించడం సరికాదన్నారు. ఈ క్రమంలోనే అమరావతికి చంద్రబాబు రానుండగా.. వంగవీటి రాధా రేపు కలవబోతున్నారు.