ZPTC MPTC Results : 19న పరిషత్‌ కౌంటింగ్‌.. అదే రోజు ఫలితాలు

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఎంపీటీసీ, జేడ్పీటీసీ ఓట్ల లెక్కింపుకు అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెక్కింపుకు సిద్ధమైంది.

ZPTC MPTC Results : 19న పరిషత్‌ కౌంటింగ్‌.. అదే రోజు ఫలితాలు

Thumb

Updated On : September 21, 2021 / 12:59 PM IST

ZPTC MPTC Results : ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఎంపీటీసీ, జేడ్పీటీసీ  ఓట్ల లెక్కింపుకు అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెక్కింపుకు సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

Read More : Nirmal : సెప్టెంబర్ 17 నిర్మల్‌‌కు అమిత్ షా..బీజేపీ భారీ బహిరంగసభ

ఓట్ల లెక్కింపుకు సంబందించిన నోటిఫికేషన్ ను గురువారం రాత్రి విడుదల చేశారు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.. అదే రోజు సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Read More : Harassment : బాలుడిపై లైంగిక దాడి.. ఆయాకు 20ఏళ్ల జైలు శిక్ష

కౌంటింగ్ కేంద్రాల వద్ద కరోనా నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చెయ్యాలని విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్ఈసీ సాహ్ని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను 18వతేదీ సాయంత్రంఐదు గంటలలోగా ఆర్వోలకు అందించాలని సూచించారు.