బెట్టింగ్‌లో డబ్బులు పోయాయ్.. మేం చనిపోతున్నాం.. యువకుల సెల్ఫీ సూసైడ్

రెండు నెలలుపాటు సాగిన ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ బూతం ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ఈ క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వీడియో తీసుకుని ఇద్దరు వ్యక్తులు పురుగులు మందు తాగిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ బెట్టింగ్ లో రూ. లక్షల్లో నష్టపోయామని.. డబ్బులు చెల్లించాలని బుకీల నుంచి ఒత్తిడి పెరిగిందని, అందుకే చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగుతున్నట్లుగా సెల్ఫీ వీడియో తీసి, ఆ వీడియోను బంధువులకు వాట్సాప్ ద్వారా పంపించారు పెదకూరపాడు మండలం త్యాళ్లూరు గ్రామానికి చెందిన సురేష్ (22), బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన ఊర శంకర్ కుమారుడు కొమరయ్య (21) అనే ఇద్దరు యువకులు. బెల్లంకొండలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
https://10tv.in/two-persons-including-a-woman-held-for-ipl-betting-in-hyderabad/
అంతకుముందే దారిలో పురుగుల మందు తాగిన వీరు.. క్రికెట్ బెట్టింగ్‌లో రూ.లక్షల్లో నష్టపోయామని, డబ్బులు చెల్లించాలని బెట్టింగ్ నిర్వాహకుడు ఒత్తిడి తేవడంతో చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగుతున్నామంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు ఇద్దరిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్ చనిపోగా, కొమరయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా డాక్టర్లు చెప్పారు.