‘46 ఇయర్స్ ఇండస్ట్రీ గారూ..’ అంటూ చురకలు అంటించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులను..

‘46 ఇయర్స్ ఇండస్ట్రీ గారూ..’ అంటూ చురకలు అంటించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav

Updated On : September 13, 2024 / 1:58 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చురకలు అంటించారు. ”46 ఇయర్స్ ఇండస్ట్రీ గారు.. మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలు చూసి మీ విలువలు విశ్వసనీయత చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు విశ్వసనీయత, విలువలు ఉన్నాయా?

ప్రెస్ మీట్ లో పెర్ఫార్మెన్స్ పీక్స్.. ఆచరణలో మ్యాటర్ వీక్.. ప్రజల మద్దతుతో గెలవకుండా కొనసాగుతున్న రాజ్యసభ సభ్యులతో, ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకుంటున్నామని గొప్పలు చెప్పే మీరు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులను రాజీనామాలు చేయించి తీసుకునే దమ్ముందా? 15 రోజుల క్రితం మీరు మాట్లాడిన మాటలలో మీకు ప్రజాక్షేత్రంపై ఎంత గౌరవం, విలువలు ఉన్నాయో బాగా అర్థం అవుతోంది” అని చెప్పారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన పలు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అనిల్ కుమార్ యాదవ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Also Read: ఉద్రిక్తతల నడుమ… అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లిన దానం నాగేందర్