జగన్ కీలక నిర్ణయం : అసెంబ్లీ సమావేశాలు 2 రోజులే ?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపధ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం,అదే రోజు ధన్యవాద తీర్మానం ఉంటాయని సమాచారం. అంతేకాదు,రాష్ట్ర బడ్జెట్‌ను కూడా అదే రోజు ప్రవేశపెడుతారని తెలుస్తోంది. ఆదే రోజు బడ్జెట్‌కు సభా ఆమోదం పొంది.. మరుసటి రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
కాగా…. ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ ప్రసంగం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్నామని…కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీ కి వచ్చే సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని….పూర్తిగా అసెంబ్లీ, మండలి ని శానిటేషన్ చేస్తున్నామని వివరించారు. శాసన సభ్యులు మినహా ఇతరులెవ్వరిని అసెంబ్లీలోనికి అనుమతించేదిలేదని, విజిటర్లు, సభ్యుల వ్యక్తి గత సిబ్బందికి కూడా అనుమతి లేదని చెప్పారు.