కూటమి సునామీలో కొట్టుకుపోయిన ‘వైసీపీ వారసులు’.. 25ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ విజయం
ఏపీ ఎన్నికల్లో టీడీపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. రికార్డు విజయం నమోదు చేసింది.

AP Elections Results 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైసీపీ సీనియర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. ఈసారి తమ వారసులను రాజకీయాల్లోకి దింపి, వారిని గెలిపించుకోవాలని వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల్లో వైసీపీ నేతల వారసులు ఓటమిపాలయ్యారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన వారు కూటమి సునామీలో కొట్టుకుపోయారు. ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలైన వారిలో ఎవరెవరు ఉన్నారంటే.. తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, బందరులో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పరాజయం పాలయ్యారు.
Also Read : ఏపీలో కూటమి సునామీ.. కేకే చెప్పిందే అక్షరాల నిజమైంది..!
కడపలో 25ఏళ్ల తర్వాత టీడీపీ విజయం
ఏపీ ఎన్నికల్లో టీడీపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. రికార్డు విజయం నమోదు చేసింది. కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ దాదాపు 25ఏళ్ల తర్వాత గెలిచింది. చివరిసారిగా అక్కడ 1999లో ఖలీల్ బాషా విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 09లో అహ్మదుల్లా (కాంగ్రెస్), 2014, 2019లో అంజాద్ బాషా(వైసీపీ) గెలిచారు. ఇప్పుడు టీడీపీ జెండా ఎగిరింది. 25ఏళ్ల తర్వాత కడపలో గెలవడమే కాదు.. ఒక ముస్లిమేతర వ్యక్తి అక్కడ గెలవడం 35 ఏళ్లలో ఇదే తొలిసారి. 1989లో శివానందరెడ్డి(INC) గెలవగా, ఇప్పుడు మాధవీరెడ్డి (టీడీపీ) సంచలన విజయం సాధించారు.
Also Read : తిరగబడ్డ ‘రాయలసీమ’ ఫలితం..! కూటమి అభ్యర్థుల హవా ..