ఏపీ కేబినెట్ భేటీ..వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ లే అవుట్లు, భూముల రీ సర్వేకు ఆమోద ముద్ర

  • Published By: bheemraj ,Published On : November 27, 2020 / 02:39 PM IST
ఏపీ కేబినెట్ భేటీ..వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ లే అవుట్లు, భూముల రీ సర్వేకు ఆమోద ముద్ర

Updated On : November 27, 2020 / 4:01 PM IST

AP Cabinet Meeting : ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. 27 ఎజెండా అంశాలపై కేబినేట్ భేటీలో చర్చించారు. నివార్ తుపాను నష్టంపై చర్చించారు. అలాగే… 28.30లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రపోజల్స్ పై కేబినేట్‌లో చర్చించారు.



వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ లే అవుట్లకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం. భూముల రీ సర్వేకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 21న రీ సర్వే కార్యక్రమం ప్రారంభం కానుంది.



https://10tv.in/sp-charan-thanks-ap-cm-ys-jagan-nellore-music-dance-school-renamed-spb/
భారీ వర్షాలు, నివార్ తుపాన్ పై కేబినెట్ లో చర్చించారు. ప్రాథమికంగా 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని అంచనా చేశారు. నష్టపరిహారంపై వచ్చే నెల 15లోగా అంచనాలు పూర్తి చేయాలని సీఎం జగన్ అన్నారు.



తుపాను కారణంగా మృతి చెందిన వారికి కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. జనవరి 2021 నాటికి పరిహారం చెల్లించాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సడీపై విత్తనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.