రాజధాని రగడ : అన్ని డబ్బులు లేవు..రైతులను సంతోషపరుస్తాం

ఏపీ ప్రభుత్వం దగ్గర లక్షల కోట్ల రూపాయల డబ్బులు లేవని..అందుకే రాజధాని విషయంలో పలు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకొంటోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడించారు. అమరావతి రాజధాని రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని, వారికి చేదోడు వాదోడుగా ఉంటుందన్నారు. బాబు పాలనలో ఒక తాత్కాలికమైన సెటప్ ఏర్పాటు కోసం రూ. 5 వేల 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ఇది పూర్తి కావాలంటే..ఇంకా..లక్షా 9 వేల కోట్లు రూపాయలు అవసరమన్నారు.
మరి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదన్నారు. 2019, డిసెంబర్ 26వ తేదీ గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం జరిగింది. భేటీ అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ..
GN RAO కమిటీ ఇచ్చిన నివేదిక అనంతరం జరిగిన పరిణామాలపై తాము మాట్లాడడం జరిగిందన్నారు. రాజధాని నిర్మాణం..కొత్త పట్టణాల నిర్మాణం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లక్షల కోట్ల రూపాయలు పెట్టే స్థోమతా ఉందా ? అనేది ఒక ప్రశ్న అన్నారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయలకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని, మరి ఈ డబ్బుకు వడ్డీ ఎక్కడ తేవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
తక్కువ ఖర్చుతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో GN RAO ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి వాటిపై డబ్బులు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. పెట్టుబడి లేకుండా..తాత్కాలిక ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏదోరకమైన కక్ష కానీ..లేదని స్పష్టం చేశారు.
* రాజధాని అంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించాలన్నది రాంగ్ ఒపీనియన్.
* రాష్ట్రాన్ని, రాజధాని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం.
* రైతులు సంతోష పరిచే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
* రాజధాని అంటే..సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ ఉంటే..చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి.
* లక్షల కోట్లు ఖర్చు పెట్టి..రాజధాని నిర్మించాలన్నది తప్పు.
* రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి.
* రాజధాని ప్రాంత భూములను అభివృద్ధి చేస్తాం.
Read More : హౌసింగ్ ప్రాజెక్ట్స్ లో రివర్స్ టెండరింగ్ : రూ.104 కోట్లు ఆదా