AP CEC Review : ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈఓ వీడియో కాన్ఫరెన్స్

AP CEC Review : ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు.

AP CEC Review : ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈఓ వీడియో కాన్ఫరెన్స్

AP CEC Review with Election officials

Updated On : June 2, 2024 / 7:28 PM IST

AP CEC Review : ఏపీలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాటు పూర్తి అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎల్లుండి కౌంటింగ్ జరగబోతుంది. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు.

Read Also : నేను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిశానా? అంటూ మంత్రి కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్

ఎన్నికల సిబ్బంది, ర్యాండమైజేషన్, ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. అలాగే రౌండ్లవారీగా ఫలితాల ట్యాబలైజేషన్, ఐటీ సిస్టమ్‌ల ఏర్పాటు, ఈవీఎంలను సీల్ చేసే విధానం, స్టేట్యూటరీ నివేదిక, రౌండ్ వైజు నివేదికలను పంపేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటుపై సమీక్ష జరిపారు. ఇండెక్స్ కార్ట్, మూడెంచల భద్రత వ్యవస్థ ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించారు.

ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగబోతుంది. 98 టేబుల్లలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు, 104 టేబుళ్లలో పార్లమెంట్ ఓట్లు లెక్కిస్తారు. మొత్తం 140 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయబోతున్నారు.

మూడు నియోజకవర్గాల్లో 65 రౌండ్లలో ఓట్ల లెక్కింపు :
అనకాపల్లి జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఫ్యూచర్ వరల్డ్ స్కూల్లో కౌంటింగ్ జరగబోతుంది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటు స్థానానికి 14 టేబుల్ ద్వారా ఓట్లు లెక్కిస్తారు. అటు అల్లూరి జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటుకు సంబంధించి పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంపచోడవరం జూనియర్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఓట్లను 65 రౌండ్లలో లెక్కించబోతున్నారు.

చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు అన్ని పూర్తి అయిపోయాయి. చిత్తూరు నగరంలోని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలు ఓట్ల లెక్కింపు జరగబోతుంది ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కిస్తారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పోలైన ఓట్లను అనుసరించి 17 నుంచి 21 రౌండ్లలో కౌంటింగ్ జరుగబోతోంది. ఓట్ల లెక్కింపులో మొత్తం 1088 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

Read Also : తిహార్ జైలులో లొంగిపోయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్