ఏపీలో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగింది.. 81 శాతం పోలింగ్ నమోదు ఉండొచ్చు : సీఈఓ ముఖేశ్ కుమార్

ఏపీలో భారీగా ఓటింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2గంటల వరకూ పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా అన్నారు.

ఏపీలో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగింది.. 81 శాతం పోలింగ్ నమోదు ఉండొచ్చు : సీఈఓ ముఖేశ్ కుమార్

AP CEO Mukesh Kumar Meena (Photo : Google)

Updated On : May 14, 2024 / 2:09 PM IST

AP CEO Mukesh Kumar Meena : ఏపీలో భారీగా ఓటింగ్ నమోదైందని, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా అన్నారు. ఏపీలో పోలింగ్ సరళిపై ముఖేశ్ కుమార్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. గత ఎన్నికలకంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పారు.

2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదు కాగా.. 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 79.8 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకూ 78.25 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్ తో 79.4 శాతం పోలింగ్ నమోదయింది.

Also Read : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు.. జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు ఇవే

తమ అంచనా ప్రకారం మొత్తం 81 శాతం పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నామని, మధ్యాహ్నం వరకు పూర్తి వివరాలు వస్తాయని ముఖేశ్ కుమార్ మీనా చెప్పారు. రాత్రి 12 గంటల తరువాత కూడా పోలింగ్ కొనసాగిన కేంద్రాల్లో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశామని, సుమారు 20 కేంద్రాల్లో కొత్త ఈవీఎంలకు మాక్ పోలింగ్ నిర్వహించామని ఆయన తెలిపారు.