Davos Tour : వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు ఏపీ బృందం..
రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునర్ ఉత్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్ట్ లో ఏపీలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు.

Davos Tour : ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు ఏపీ బృందం హాజరు కానుంది. రాష్ట్రం నుంచి ప్రతినిధుల వెళ్లే బృందం ప్రతిపాదనలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సదస్సుకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ బృందం వెళ్లనుంది.
ఐటీ మంత్రి నారా లోకేశ్ తో పాటు పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు అధికారులు దావోస్ వెళ్లనున్నారు. ఏపీలో వనరులు, పెట్టుబడి అవకాశాలపై దావోస్ లో సీఎం చంద్రబాబు వివరించనున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునర్ ఉత్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్ట్ లో ఏపీలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు.
Also Read : రేషన్ బియ్యం ఉచ్చు పేర్నినానికే పరిమితం కాలేదా?
షేపింగ్ ద ఇంటెలిజెన్స్ ఏజ్ అనే థీమ్ తో దావోస్ లో ఏపీ స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్ తో పాటు ఏపీకి ప్రత్యేకంగా ఓ స్టాల్ ను కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేసింది.
దావోస్ లో ఎప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు జరిగినా.. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా అక్కడికి వెళ్లి పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రక్రియ ఆయన మొదటి నుంచి చేస్తున్నారు. తన ఆరోగ్యం బాగోలేకున్నా దావోస్ కి వెళ్లి అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈసారి కూడా 2025కి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు చంద్రబాబు బృందం హాజరుకానుంది.
జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారాలోకేశ్ హాజరుకానున్నారు. ఈ నెల 19వ తేదీన సీఎం చంద్రబాబు, ఆయన బృందం దావోస్ కు బయలుదేరి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు బృందంలో పరిశ్రమలకు సంబంధించిన అధికారులు, ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుకు సంబంధించిన అధికారులు పాల్గొననున్నారు.
Also Read : విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..