Cm Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

ఆ తర్వాత నార్త్ బ్లాక్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

Cm Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

Updated On : July 15, 2025 / 6:19 PM IST

Cm Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరుగుతున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు.

కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి మన్ సుఖ్ మాండవీయతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత నార్త్ బ్లాక్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రేపు సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్ కు చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ నెల 17న ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి తిరిగి అమరావతికి ప్రయాణం కానున్నారు చంద్రబాబు.

Also Read: ఏపీకి షాకిచ్చిన తెలంగాణ సర్కార్.. బనకచర్లపై చర్చకు ససేమిరా.. అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి లేఖ

రెండు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఈ మధ్యాహ్నం కీలక వ్యక్తులతో చంద్రబాబు భేటీ అయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తో చంద్రబాబు సమావేశం అయ్యారు. 3గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతోనూ భేటీ అయ్యారు. సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులు, విభజన సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించి గత కొంత కాలంగా పెండింగ్ లో ఉంచారు. ఆ హామీలన్నీ త్వరగా నెరవేర్చే విధంగా చూడాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేయనున్నారు చంద్రబాబు.

రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీ షెడ్యూల్ ఉంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావాల్సి ఉంది. అయితే కేవలం బనకచర్ల అంశంపై మాట్లాడమంటే కుదరదని, తెలంగాణతో ముడిపడి ఉన్న ఇతర అంశాలపైనా చర్చించేందుకు కేంద్రం పెద్దలు సిద్ధమైతేనే తాము కూడా బనకచర్లపై మాట్లాడతామని ఇప్పటికే కేంద్రానికి రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది.