మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధానితో కీలక భేటీ..!

ప్రధానిని కలిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధానితో కీలక భేటీ..!

Updated On : August 14, 2024 / 5:19 PM IST

Cm Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 16న ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు.. 17న ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే మోదీ అపాయింట్ మెంట్ కోరారు. రాజధాని, పోలవరం నిర్మాణాలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులతో పాటు కొంత రుణాలకు సంబంధించి మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. జగన్ హయాంలో చేసిన రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరనున్నారు చంద్రబాబు. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు.

సీఎం చంద్రబాబు ఎల్లుండి సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 17వ తేదీన ప్రధానితో అపాయింట్ మెంట్ కోసం సీఎంవో కోరింది. ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారు కావాల్సి ఉంది. ఎల్లుండి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. ప్రధానిని కలిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను ఢిల్లీలో చర్చించాల్సి ఉంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు కోరనున్నారు. ఏపీ రాజధాని అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్, వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, రుణాల రీషెడ్యూల్.. తదితర కీలక అంశాలపై చంద్రబాబు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. గత ప్రభుత్వం హయాంలో కేంద్రం నుంచి అనేక నిధులు వచ్చాయని, వాటన్నింటిని రీషెడ్యూల్ చేయాలని కోరే ఛాన్స్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే పరిస్థితులు లేనందున.. రుణాలను రీషెడ్యూల్ చేయాలని చంద్రబాబు అడుగుతున్నారు. అలాగే కొత్త రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అడుగుతోంది. దానికి సంబంధించి కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Also Read : ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో వైసీపీ నేత..! జోగి రమేశ్‌ చుట్టూ ఉచ్చుబిగిస్తున్న ప్రభుత్వం