AP EBC Reservations : ఏపీలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు, ప్రభుత్వం కీలక నిర్ణయం

అగ్రవర్ణాల్లోని పేదలకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

AP EBC Reservations : ఏపీలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Ap Ebc Reservations

Updated On : July 14, 2021 / 11:04 PM IST

AP EBC Reservations : అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చే యోచనలో ఉంది. దీనికి సంబంధించి ఈ రాత్రికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

2019లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు రాజ్యాంగ సవరణ చేసింది కేంద్రం. ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, వెలమ తదితర అగ్రవర్ణ పేదలకు లబ్ధి కలగనుంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాక రాష్ట్రంలో అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ అమలు కానుంది.

అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2019 జనవరిలో ఆమోద ముద్ర వేశారు. విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అందుతాయని, ‘‘సబ్‌కా సాథ్…సబ్‌కా వికాస్’’ నినాదం పరిపూర్ణం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు బీజేపీ చెప్పుకొచ్చింది. గొప్ప ఉద్దేశ్యంతో ఈబీసీ రిజర్వేషన్ల చట్టం చేస్తున్నామని బీజేపీ తెలిపింది.