DISHA Vehicles : ఏపీలో దిశ వాహనాలు

కోటి 16 లక్షల మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు పట్టణాల్లో ఐదు నిమిషాల్లో, గ్రామాల్లో 10 నిమిషాల్లో దిశ సిబ్బంది చేరుకుంటారని చెప్పారు.

DISHA Vehicles : ఏపీలో దిశ వాహనాలు

Disha Vehicles

Updated On : March 24, 2022 / 7:36 AM IST

DISHA vehicles : ఏపీలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కొత్తగా 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలు, 18 మొబైల్‌ విశ్రాంతి వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ వాహనాలు జీపీఎస్‌తో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానమై ఉంటాయన్నారు.

కోటి 16 లక్షల మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని సీఎం జగన్‌ తెలిపారు. ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు పట్టణాల్లో అయితే ఐదు నిమిషాల్లో, గ్రామాల్లో అయితే 10 నిమిషాల్లో దిశ సిబ్బంది చేరుకుంటారన్నారు.